Home  »  TV News  »  Karthika Deepam2 : ఆస్తులపై కన్నేసిన జ్యోత్స్న, పారిజాతం.. కార్తీక్ ఏం చేస్తాడు!

Updated : Oct 29, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -187 లో....పారిజాతం హాల్లో కూర్చొని టీ తాగుతుంటుంది. అప్పుడే గుడి నుండి సుమిత్ర ఇంటికి వస్తుంది. నాకు చెప్తే నేను వచ్చేదాన్ని కదా అని పారిజాతం అనగానే.. ప్రశాంతత కోసం వెళ్ళాను. మీ ఆలోచనలతో నా కూతురు మనసు ని పాడుచేశారు. మీకు వయసు పెరిగింది అంతే అర్థం చేసుకునే మనసు పెరగలేదని సుమిత్ర అనగానే.. పారిజాతానికి కోపం వస్తుంది. ఎంత మాట అన్నావ్.. నీ సంగతి చెప్తానని అనుకుంటుంది పనిమనిషి వచ్చి పారిజాతానికి సెటైర్ వెయ్యడంతో పారిజాతానికి కోపం పెరుగుతుంది. 

మరొకవైపు దీప ఇంటికి వస్తుంది. సత్యనారాయణ వ్రతం చేయాలన్నారంట కదా.. దానికి నేను ఒప్పుకుంటున్నాను కాకపోతే ఒక కండిషన్.. కండిషన్ కాదు రిక్వెస్ట్ అని దీప అంటుంది. పూజ తర్వాత అత్తగారిగా మీరున్నారు.. మీ పక్కన ఆశీర్వాదించడానికి శ్రీధర్ గారు కూడా ఉండాలని అనగానే.. సరే అని కాంచన అంటుంది. ఆ తర్వాత గుడిలో జరిగిన విషయం దశరథ్ కి సుమిత్ర చెప్తుంది‌ దీప బాధపడుతుందా.. నేను నమ్మను.. తనేం చిన్నపిల్ల కాదు కదా అంటూ దీపపై చిరాకుగా దశరథ్ మాట్లాడతాడు. అప్పుడే పారిజాతం వచ్చి.. ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.  జ్యోత్స్న కార్తీక్ ని తప్ప ఇంకెవరని చేసుకోనంటుందని పారిజాతం అనగానే.. ఇంకొకసారి వాళ్ళ టాపిక్ తియ్యొద్దని దశరథ్ అంటాడు. ఆ తర్వాత ఇలా రెచ్చగొట్టేల మాట్లాడొద్దంటూ పారిజాతాన్ని సుమిత్ర తిడుతుంది.

మరొకవైపు పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు ప్లాన్ చేస్తుంటారు. ఆస్తులన్నీ ముసలోడి పేరు మీద ఉన్నాయి. కాంచనకి ఆస్తులు ఇవ్వకుండా‌. ఛీ అనేలా చేస్తే వాళ్ళకి ఆస్తులు ఉండవు. అప్పుడు కార్తీక్ నీ దగ్గరికి వస్తాడని పారిజాతం అనగానే.. సూపర్ అని జ్యోత్స్న అంటుంది. కానీ ముందు దీపపై కార్తీక్ కి కోపం వచ్చేలా చెయ్యాలి.. నాపై సింపథీ రావాలని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత కాంచన శ్రీధర్ దగ్గరికి వెళ్లి ఆశీర్వదించడానికి రమ్మని చెప్తుంది. నేను రానంటే ఏం చేస్తావని శ్రీధర్ అనగానే.. కార్తీక్ తండ్రిగా మీరు వస్తారని కాంచన అంటుంది. తరువాయి భాగంలో శ్రీధర్ ని పిలవడానికి కాంచన వెళ్ళిందని దీపకి అనసూయ చెప్తుంది. రేపు మిమ్మల్ని దీవించడానికి మా దంపతులం వస్తాం.. ఇక నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కాంచన అంటుంది‌. ఆ తర్వాత కార్తీక్ రెడీ అవ్వుతుంటే తన దగ్గరికి వెళ్లి.. మీ పక్కన కూర్చొని వ్రతం చెయ్యలేను బాబు.. ఎలాగైనా ఆపండి అని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.